Saturday, November 28, 2009

రాయలసీమ రత్నాలు

రాయలసీమ సామెతలు
అంగట్లో అన్నీ ఉండాయి గాని అల్లున్నోట్లో శని
అంగడి బియ్యం తంగేడికట్లు
అంగడోనికి బత్తెం కరువు
అంటికాయలు తిన్న బేకారీ పొట్ల్యాడేస్తివి
అంటుకుంటే ముట్టుకుంటుంది
అంటే ఓ రాదు న అంటే మ రాదు
అందరికి కొడుకు పెళ్ళి కొడుకు
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు
అచ్చం కర్రోన్ని అర నత్తోన్ని నమ్మకుడదు
అడకతినేదానికి అవిసిరిమొస్తే వొంకిరి బింకిరికాయిలు (చింతకాయలు) ఏమాయ రాజా అన్నెంట
అడగంది అమ్మయినా అన్నం పెట్టదు
అడుక్కున్నమ్మకి అరవై కూర్లు
అడుసుతొక్కనేల కాలు కడగనేల
అత్తసొత్తు అల్లుడు దానంజేసినట్టు
అనుకున్నదొగటి అయిందొగటి
అన్ని ఉన్న అల్లున్నోట్లో శని
అపద్దమాడినా అతికినట్టుండాలి
అమ్మ పుట్నిల్లు మ్యానమామ ఎరగడా
అమ్మ పెట్టదు అడుక్కుతిన నివ్వదు
అమ్మను తిట్టకురా నీ అమ్మ నా కొడకా
అమ్మా అంటే రాదు,అక్కా అంటే రాదు చేయిబట్టిలాగితే వస్తుంది తలుపు
అయిపొయిన పెండ్లికి మేలమేల
అయ్యవారు నిలబడి పోస్తే పిల్లవాండ్లు పారాడుతు ఉచ్చులుబోసిరి
అరగాసాదాయం ల్యా, గెడిసేప్ బిడువు ల్యా
అరచేతిపుండుకద్దమేల
అరచేతిలో స్వర్గం
అవేకల్లు తేడా వొల్లే
అవ్వా బువ్వా రొండూ గావల్లా అంటే ఎట్లా
అసలేరు కార్తెలో ముసలెద్దు రంకె ఎత్తది
అసలేరులొ అడ్డెడేసినెక్కువ మొలుస్తాయి
అస్తం ఆరు గడియలు చూసి పోతారు
ఆకాశానికి అద్దేది
ఆకాశానికి నిచ్చిని ఏయలేంగదా
ఆడదై పుట్టేకన్నా అడివిలో మానై పుట్టేది మేలు
ఆడపెత్తనం బోడి పెత్తనం
ఆదరా బాదరా పదరా మొగుడా
ఆరిత్రపడకుంటె ఆరు కార్తరులు ఉత్తదే
ఆరుద్ర కార్తీలో వాన పడితేఆరు కార్తుల్లో కూడ వర్షాలు బాగ పడతాయి
ఆరుబిడ్డల తల్లికి ముగ్గురు బిడ్డల తల్లి మూల్గ నేర్పుతాది
ఆలులేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం
ఆవర్లా,దూడర్లా, దుత్తరిసెనంట
ఆస్తి మూరెడు, ఆశ బారెడు
ఇంటి ఎద్దుకు బాడుగ
ఇంటికన్న గుడి పదిలం
ఇంటికో కడిదిని గుంటగ్గుక్కనీల్ దాగినట్టు
ఇంతే సంగతులు చిత్తచ్చవలయును
ఇచిత్రానికి ఇద్దురు పుడితే ఈడ్చలేక ఇద్దరు సచ్చిరంట
ఇచిత్రానికి ఈర్లు బెడితే ఇంటాదికి యారగబెట్నంట
ఇచ్చేవోడు ఉంటే సెచ్చోవోడు లేసొచ్చినంట
ఇచ్చేవోన్ని సూసి చ్చేవోడుకూడా లేసొచ్చ
ఇట్లిట్లే రమ్మంటే ఇల్లంతా నాదే అన్నెంట
ఇత్తుముందా చెట్టు ముందా
ఈనగాచి నక్కల పాలయినట్లు
ఈమె పాగి(అవకాశం) పడక(దొరకక)పతివ్రత అయింది
ఉండమ్మా బొట్టుపెడతా
ఉండాడమ్మ దండు,వాడు తింటాడమ్మ రెండు
ఉచ్చలుబోపిచ్చి , దీపమంటిచ్చినట్టు
ఉచ్చు బిగిసింది
ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందని అనె
ఉడిగి బుడిగిలోకొచ్చినట్టు
ఉత్తముండ తిత్తేడేస్తివి
ఉత్తరం గాలిదోలితే మోడానికి బలం
ఉత్తరజూచి ఎత్తర గంప అంటే అత్తను జూచి అందురూపోదాం అన్నాడంట
ఉత్తింట్లో పెండ్లి, లేచిపో నాతండ్రి
ఉత్తెర కార్తి ఇత్తడసనం కార్తి
ఉత్తెర జూసి ఎత్తర గం
ఉన్నమతి బాయె చంద్రమతి పాయె
ఉన్నమాటంటే ఉలుకెందుకు
ఉన్నూరు కన్నతల్లి
ఉన్నోని పాతర తీసేలోకి లేనోని పానం పోయెనట
ఉల్లి గడ్డంత బలిజోడు ఉంటె ఊరంత చెడిపోతుంది
ఉస్కో ఉస్కో అంటేనువ్వే నువ్వే అన్నెంట
ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు
ఊరందరిది ఒక దారైతె ఊడుదొకుడుది ఒక దావా
ఊర్లో పెత్తనం ఉడత కెందుకు
ఊసుకల్లోన్ని,సన్నకాళ్ళోన్ని నమ్మకుడదు
ఎద్దినిందిరా అంటెగాట గట్టెయ్యమన్నాడాట
ఎన్నలో ఎంటికి దీసినట్లు
ఎన్నిల కొన్నాల్లు చీకటి కొన్నాల్లు
ఎబ్బుడూబెట్టని నాతల్లి బెట్టింది,ఎబ్బుడూబెట్టే నాయాలిముండ బెట్లా
ఎరువు సొమ్ములు బరువు సేటు
ఎరువుల సొమ్ము బరువుల చేటు
ఎర్రగడ్డ మజ్జిగలకచ్చిన కారం ఉండదు,ఆడమనిషి మంచం మీదికచ్చిన కోపం ఉండదు
ఎలాంటి పాదుకైనా ఎదుగేటబ్బుడు పందిలికావాలి
ఎవరికోసమో ఎనుం పాలిచ్చినట్టు
ఏ చెట్టు లేని ఊళ్ళో ఆముదం చెట్టే మహావృక్షం
ఏంటంటిబాయ బాటంటి వచ్చ
ఏక్కి ఏకిసింత అయితే ఏగోళ్లమ్మకి మిండగాళ్ళసింత
ఏటులో ఏడు అంగళ్ళు- ఎండ్రల బొక్క/రంధ్రం
ఏడుస్తు రవికె ముల్లు విప్పడం
ఏడ్సేవాడు ఏటంటిబాయ,నామొగుడు బాటంటిబాయ
ఏది కాల్చినా చనిపోతుంది, ఒకటి చనిపోదు – దోసె
ఏదిలేక అటకలాడుతుంటే అల్లుడు శీపావళీ పండుగచేయి అని అన్నాడంట
ఏనుగులు తినేవాడికి పీనుగుల పిండాకూడు
ఏమిరా సిద్దా అంటే ఎవరి దారి వాళ్ళది అన్నాడంట
ఏరుదాటి తెప్ప తగలబెట్టినట్టు
ఏరుదాటితే ఎల్లప్ప, ఏరు దాటినాక తిమ్మప్ప
ఏలికి గోరుదాపు
ఏలు జూపిస్తే సెయిమింగినట్టు
ఐవొరు రాలేదని అమాస‍ ఆగదు
ఒక బిడ్డాని ఒరబూకు బెడితె మిద్దెక్కి మిండగాన్ని చూసినంటా
ఒడ్డెబుద్ది,మొడ్డబుద్ది ఒక్కటి
ఓ ఒడ్లు గింజలో ఓ బియ్యపు గింజ
ఓటి కుండైనా ఒరగబెట్టల్ల
కందిచేన్లొ కర్ర బోగొట్టుకొని పప్పుచేన్లొ ఎదికినాడట
కట్రాయికి కట్రాయికి పొందించాలిగాని విడదీయకూడదు
కథకంచికి మనమింటికి
కధకు కాల్లు లేవు,ముంతకు చెవులు లేవు
కన్నమ్మకి కడుపుగాల్తే పిన్నమ్మకి పిర్రగుడాకాల్దు
కమ్మోడు చేప
కరి అంటే కప్పకు కోపం, ఇడి అంటే పాముకి కోపం
కల్లుకొచ్చి ముంత దాచినట్టు
కాకి కోకిల అవుతుందా కంచు కనకం అవుతుందా
కాకి వనవాసంబోతే రాళ్లవానబడిందంట
కాటికి కాళ్ళు జాపినట్టు
కాటిక్కండ్ల కోడె య‍మరిచ్చి పొడుత్తది-చెడ్డెద్దు,మోరెద్దు
కానిపనికి కస్టము మెండు
కాపోనికి ఎద్దు పెద్దది కావాలే,ఒడ్డోనికి పెల్లం పెద్దది కావాలే
కారణమట్లుంటె కైకెంజేశ
కాలికి జుట్టుకోఉంది కర్రకుండా మాన్దు
కాసే మానికే రాళ్ళ దెబ్బలు
కుంటి వాన్ని ఎంత దూరం మోసినా దింపిన చోట నిస్ఠూరమే
కుక్కకు పనిలేదు, తీరిక లేదు
కుక్కకు బువ్వొచ్చె కూటికూండకు ముప్పొచ్చె
కుక్కతెచ్చేవన్నీ పీతిగొద్దిలే
కుక్కతోక వంకర
కుక్కను గొట్టేకి గిలకల కట్టా
కుక్కలు చింపిన విస్తరి
కుచ్చుటోపీ
కుడితిబాన్లో బల్లి బన్యట్టు
కూటికి కరువైతే కూటికుండ్లకు ముప్పు
కూటికి లేనింట్లో కూతలు మెండు
కూసేగాడిదది మేసేగాడిదిని పంచేటు జెసినట్టు
కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపాయె
కొండంతా పసుపుబట్ట-తంగేడుపూలు
కొట్టిన చెయ్యే కోరు, పెట్టిన చెయ్యే కొట్టు
కొడిగట్టిన దీపం
కొత్తనీళ్ళొచ్చి పాతనీళ్ళెగొట్టినట్టు
కొత్తొగ వింత పాతొగ రోత
కొరివితో తలగోక్కున్నట్టు
కోటి ఇద్యలూ కొండ్రి మీద గలవు
కోటి తిండ్లు తిన్యా ,కొనైనా మజ్జిగ తిను
కోటిలింగాలలో కొదవలింగం
కోడలు మగబిడ్ని కంటానంటె అత్త వద్దంటుందా
కోడాలా కోడాలాఙ ఎన్నాల్లే నీ బాగోతం- ఆ మా అత్త ఊరు చుట్టొచ్చెదాక
కోడి కుయ్యో కుయ్యో అంటే నెమిలి నెయ్యో నెయ్యో అన్నెంట
కోమటిదానికి పిండయిపొయ్యిందేమొ కన్ను గొడతావుంది
కోయిల కూస్తాఎ ముసలెద్దుదడపుడుతాది
ఖండించిన పచ్చిదొకటి, కాల్చిన దొకటి, తినుటకు రుచిగా నుండును తినగానే రుచిగానుండును తిరుమలేశ
గట్లు గట్లు గాలికి పోతుంటే పీకులు నావి
గడ్డకు మించిన గడ్డపార
గడ్డుకాలంలో గుడ్డు దొరికినట్లు
గయ్యాలి గంప,గయ్యాలి గంగమ్మ
గాడిదికేం తెలుసు గందోడి వాసన
గాడు బట్టిన గంగమ్మ పూజారి అమ్మట వెళ్ళింది
గిరాం చెడి గీరుకున్నట్టు
గుడ్డికంటే మెల్ల మేలు
గుడ్డెద్దు చేలో పడ్డట్టు
గురిగింజ తన నలుపెరగదు
గూబ గయ్ మంటుంది
గొడ్డోడు గొడ్డుకేడిస్తే సియ్యోడు చియ్యకేడ్సినట్టు
గొడ్డోడు గొడ్డుకేడుస్తుంటే సియ్యోడు సియ్యకేడ్సినంట
గొడ్డోనికేందెల్సు బిడ్డ సంగతి
గొడ్లిబొయ్ మాన్లో చిక్కొంది
గొర్రెపెంటికంతా దేవళంలో ముగ్గురు మునెశ్వర్లు ఏడుగురు నాగ కన్యలు లిక్కిదోటి తంగెడుపువ్వు.
గొల్లెరిన,మచ్చేరిన-ఎంత మంచి గొల్లోనికైన ఎర్రికాయమత ఎర్రి ఉంటుంది
గొల్లోనికి గొర్రి తెలివ
గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
చల్లం బోయి బర్రెను బారం చెసినట్లు
చాటభారతం రాసినట్టు
చిత్తలో చినుకుబడిందమటేపంటకు బలం
చిన్న ఇంటిలోచింతచెవిలో గుబిలి(గులుము)
చెంపకు చేయి పరమగునపుడు కంటికి నీరు ఆదేశమగును
చెట్టుకి కాయిబరువా
చెట్టుకొక్కరు పుట్ట కొక్కరు
చెప్పేదానికంటే చేసేది మేలు(తాడి,యెల్ల,సింగ)
చెరుకు వంకరైతేనేం తీపి చెడదు
జగడమెట్లొచ్చరా జంగమయ్య అంటే బిచ్చమెయ్యే బొచ్చుముండ అన్నెంట
జరమన్నారావాలి, పండగన్నారావాలి – వరి అన్నం తినాలంటే
జిత్తులమారి నక్క
టింగురంగ నీయబ్బదొంగ
డోలు బొయ్యి మద్దిలికి మొరపెట్టినట్టు
డౌలు దర్బారులో నా మొగుడు కొనబారిలో
తంగేడుపువ్వట్లాది పనికొస్తుందంట
తడక దొబ్బినోడెవడంటే పెళ్ళాం జచ్చినోడన్నట్టు
తడబాటులోనే వుంది ఎడబాటు
తనదంటూ బారడుంటే ఉరేస్కోని జావచ్చు
తనుదన్నేవానికితోగ్గోసేవాడొస్తాడు
తలా తోకాలేని పయాణం
తల్లి చేనుమేస్తే పిల్లమ్యార మేసింది
తల్లికి పిల్లబారమా,చెట్టుకి కాయిబారమా
తాట్నెక్కే వాడుంటే వాని తలదన్నే వాడుంటాడు
తాడో పేడో తేలిపోవల్ల
తాతకి దగ్గు
తాతకు దగ్గు నేర్పుతావా
తానా అంటే తందానా అన్నట్టు
తాన్ దొంగ పొరుగును నమ్మదు
తాబేలు కుందేలులాగ
తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి
తిక్కనాసవితి తిరిగేకి కోతినాబొట్టకొట్టేకి
తిట్ల దండకం జదివినట్టు
తినేకి తిండిపోతూ పోనీకి
తినేది మొగిని సొమ్ము,పాడేది మిండడి పాట
తిమ్మరాయిణి సొమ్ము తిని బొంబారాయిని పాట పాడుతావు
తిరుపతిలో మా గుండోన్ని చూస్తివా అన్నట్టు
తీసేసినోడే రాసికొస్తాడు
తునకలు తింటా ఉండామని ఎమకలు మెడగ్గట్టుకుంటామా
తూరుపు కొండ,తూరుపు సంత ఎప్పటికీ ఎండే
తూరుపునాడు సుట్టం గాదు,తుంగ దూలం కాదు
తెలిసి సేసినా తెలియక చేసినా తప్పు తప్పే
తెల్లటోనికి నల్ల టోపి ( అగ్గి పుల్ల)
తేలుగుట్టిన దొంగ
తోలు ఎర్రనైతే ముడ్డికి చేటు
దిన దిన గండం నూరేల్లాయుశుగా
దినాలకు కధలు చెపుతారు
దురాస దుఖానికి చేటు
దెవుని గుల్లోగంటపోతే పూజారి యింట్లో శంఠం పోదు
దొంగచేతికి బీగం చేతులిచ్చినట్లు
దొందూ దొందే
దొన్నిపాప దిన్ని ఎక్కదు - గుమ్మడికాయ
నక్కెక్కడ నాకలోకమెక్కడ
నడమంత్రపు సిరి
నమ్మితిరా సిద్దా అంటే దెంగితిరా గుద్దా
నల్లగుంటికింద నలుగురు దొంగలు -ఆవు రొమ్ములు
నవ్విన నాపసేనే పండింది
నవ్వే ఆడదాన్ని ఏడ్సే మగవాన్ని నమ్మగూడదు
నాయానికి కాలం లేదుమోసగాడికి కాలం లేదు
నాశినానికి ముందు గర్వం నడుస్తుంది
నిండా మునిగినోనికి చలేం,గాలేం
నిందిలేంది బొందిపోబోదు
నిప్పురాకుండా పొగరాదు
నిప్పులేందే పొగరాదు
నివురు గప్పిన నిప్పు
నిష్ట నీళ్ళపాలు – నింద గంగపాలు
నీతే నీజాతి దాన్ని వదిలితివా నీవు కోతి
నీదారి గోదారే
నీవు ఏడైనా మామనచ్చుగాని గానుగింట్లో మామ అనొద్దు
నూటికొక్కడు
నూరు వైద్యులుకన్నా ఓ రచ్చ మేలు
నెయ్యల్లబెట్టి పియ్యెల్ల గొట్నెంట
నేనే డబ్బుల్లేక జస్తుడంటే నీదోటి పీకులాట
నొశ్టపుల్లగా(ఎరుపుగా)ఉంటె అమిరిచ్చి బాగ పొతదినిఒసలుమీద ఎర్రగా ఉన్న ఎద్దు బాగ నడుస్తాది
పండగరోజూ పాత మొగుడేనా
పడమట వక్రమొడ్డితే పందిలినిండా వొడ్లే
పడమట చండ్రగూడు కడితె పందిల్ల మీద కూడ పైరు పండుతాది
పడమటి భాగంలో కొర్రు ఒడ్డుతే పందిర్ల మీద వరి పండుతుంది
పత్తికొండ గాలిదోలితే మోడం ఎగిరిపోతుంది
పప్పులో కాలేసినట్టు
పరమట కొర్రొడ్డితే ఇల్లంతా ఒడ్లే
పరాయి దాని మొగడు కర్సుకొని ఉన్నాడు, లేత్తె వాడు ఊరుకోడు –కొడుకు
పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగేదిమేలు
పానముంటేనే పరాక్కరమాలు
పిండికొద్దీ రొట్టి
పిచ్చుకపై బ్రహ్మాస్రము
పిచ్చోడి పెళ్ళికి తిన్నోడు మారాజు అంట
పిల్లలకు బోగినాడుతానం జెపిస్తే బోగి బోగిన పెరుగుతారు
పిల్లి సాపినికి ఉట్టి తెగదు
పిల్లి సాపినికి ఉట్టి తెగదు
పిల్లి సాపిస్తే ఉట్లు తెగవ్‌
పిల్లిని సంకలో బెట్టుకున్నట్టు
పీనిక్కి సింగారంజేసినట్టు
పుక్కిటి పురాణం నీకేల
పుట్టిడు నీళ్ళకడ్డుబెడితే పులుగులుపడ్తాయి
పుడితే కోమిటోనింట్లోపుట్టాలి, చస్తే సాయిబులింట్లో చావాలి
పురివిప్పిన నెమిలి
పుశ్యల కార్తిలొ పుట్టెడు సల్లె బదులు అడిలేరు కార్తిలొఅడ్డెడు చల్లిన చాలు
పెదవిదాటితే కోటదాటె
పెద్దలు జెప్పిన మాట పెరుగు సద్దన్నం మూట
పెల్లి కాని వారికి చిన్నదినం,పెద్దదినం చేయరు
పేనుకు పెత్తనమిచ్చినట్టు
పొంగింది పొయ్యిపాలు
పొగ బెట్టిన తర్వాత కలుగులోని ఎలకలన్నీ బయటికొచ్చినట్టు
పొట్టివానికి పుట్టెడు విద్యలు-పొట్టివాడికి ఎక్కువ తెలివి
పొమ్మన్లేక పొగబెట్టినట్టు
పొయ్యింది పొట్టు, ఉన్నింది గెట్టి
పోంగపోంగ దోవమర్జి, సూడంగ సూడంగ మనిషి మర్జి
పోక పొరుగింటికి పోతె రాక రొండు వచ్చు
పోతే దెలుస్తుంది బావగారి సంగతి
పోరుకు పొత్తార్చినట్టు
పోరుకు పొత్తార్చినట్టు
బట్టబొయ్యి ముల్లుమీద పడ్న్యా, ముల్లుబొయ్యి బట్టమీద పడ్న్యా ఒగటే
బడాయికి బోతే లడాయొచ్చినట్టు
బడాయికిబోతే లడాయొచ్చినట్టు
బతికినబ్బుడు బారడు బట్టివ్వలేదుగాని సచ్చినంక సమాధిమింద సందిడు పూలు జల్లినంట
బతికుంటే బలుసాకు తిని బతకచ్చు
బావి చుట్టు రాళ్ళు –పళ్ళు
బింకమిడద్దురా బంకనాయాల
బిక్కమల్లయ్య సంతకి బొయినట్టు
బిక్కమల్లయ్య సంతకు పోయినట్టు
బిత్తిరి బిడ్నిగంటే ఈడ్సలేక ముగ్గురు సచ్చిరంట
బీటికి బిడువు మాలిన ముగ్గు బెట్నెట్టు
బీదలకు ఆశపెట్టకూడదు, ధనవంతులకు చోటు ఇవ్వకూడదు
బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా కష్టమే
బెల్లమున్నచోటికే ఈగలు
మంగలారం జేసిన పని మల్లీజేయాలంట.
మంచినీళ్ళ ప్రాయంగా
మంచుకింద మంటలా
మందెక్కువైతే మజ్జిగ పల్సన
మక్కార్తిలొ మొక్క వేస్తె తప్పక బతుకుతుంది
మట్కా ఆడేవాడు ఆఖరికిజెట్కా తోలాలి
మనిషికి పొగిడింపు,బట్టకి జాడింపు, కూరకి తాలింపు
మనిషికోమాట , అంటికో కాత
మనిషిముందర మనిషిమాట
మనోరోగానికి మందులేదు
మా నాన్న రాత్రి బొరుగులు తెస్తారు, తెల్లవారి చూస్తే అయిపోతాయి – చుక్కలు
మా నీళ్లకి పప్పులేం ఉడకవ్
మా యింటి ఎనక గూనోడున్నాడు. దాని సురంగి ఏమిటంటే - మడక
మాట ముఖ్యమా మూట ముఖ్యమా
మాటే మాణిక్యం
మాట్లు జెప్పేవాళ్ళేగాని మూట్లు మోసేవాళ్ళుగాదు
మానెక్కేవాని ముడ్డి ఎన్ చేపు దోస్తావు
మాలబంటుకో కూలిబంటు
మాలోడికి మైలుదూరం వెళ్ళిన తరువాత ఆలోచన
మావూరికొగ టికట్టీ అన్నట్టు
మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపంగనూనె(తాడి,యెల్ల,సింగ)
మీసాలొచ్చేటోనికి దేశాలు కనపడవు
ముంజేతికంకణానికి అద్దమేల
ముండ మోసిన ఆడది మొగుణ్ణి కక్కయ్య అన్నది
ముందుపోయే ముతరాసోడిని ఎనకవచ్చే యానాదోడ్ని నమ్మకూడదు
ముందొచ్చిన చెవులకొంటే ఎనకొచ్చిన కొమ్ములు వాడి
ముచ్చు ముచ్చుగానే మూల్లోకాలు ముంచినట్టు
ముదురాకు రాలునని చిగురాకు నవ్వెనట
మురిపానికి ముల్లి ముల్లి అంటే ఎల్లకాలం నాపేరు తిరద్ఇంగలాడి అన్నెంట
ముల్లును ముల్లుతోనే దియ్యల్ల
మేలు జేసేటోళ్ళకెపుడూ మెట్టేట్లు, ఆలిని దెంగినోనికి అప్పచ్చిలు
మేలుచేసిన వానికి మెట్టి దెబ్బలు
మొగిన్నిగొట్టి మగిలిపొదమిందేసి
మొగుడు సచ్చి మొత్తుకుంటుంటె లంజగాడొచ్చి రాయేసిండు
మొగుడుజచ్చి మొత్తుకుంటుంటే మిండగాడొచ్చి సండ్లు బిసికె.
మొదలెలేదు అంటే ఒక్క దేవుడికన్న మొక్కు అన్నట్లు
మొదల్లు లేదు సుబ్బక్క అంటె మూడు దేవుళ్ళకు మొక్క మన్నాడు
మొసేవోనికి దెలుస్తుంది మోతబొరువు
మోచేతులకింద నీళ్ళు తాగేవోడు
యా పిల్లయితే యేమి ఎలకని బట్టేకి
యాతంబాన్లో తీతవగుడ్లు, తియ్యాబోతే కర్రావచ్చు కుండలో సంగటి ముద్దలు
యాయాకు రాలినా ఈతాకు రాల్దన్నట్లు
యారకతిని ఎండ్లోబొనుకున్నట్టు
యారకతిని ఏట్లో బొనుకున్యట్టు
రాగల్రాయి తిరగతా ఉంటే రాజ్యమంతా చుట్టాలే
రాజుదలిస్తే దెబ్బలకు కొదవా
రెంటికీ చెడ్డ రేవడి
రెండు చేతులు కలిస్తేనే గదా చప్పట్లు
రెట్టింపు పనికి గుర్తింపుంటుంది
రెయ్యంతా రామాయణం ఇని పొద్దన్నే రామునికి సీతేమయితుంది అన్నట్లు
రోసుమొచ్చిన పందికొక్కు రోలు మింగెరా
రోహినికార్తెకు రోల్లు పగులుతాయి
రౌతుకొద్దీ గుర్రం
లంచానికి మంచమేస్తారు
లాలం దొరికితె గర్రం బారం జెసినట్లు
వంకరటింకరి సో, వాని తమ్ముడు అ – శొంఠి
వచ్చీరాని బాస వంటికి మోసం
వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి
వట్టిసేత్తో మూరేసినట్లు
వద్దు వద్దంటే మెడగట్టినారు పెద్ద ఎద్దంత పెండ్లాన్ని నాకు
వాడు ఉడుకునీళ్ళు తాగిస్తానంటే నేను సన్నీళ్ళు దాపిస్త
వాన్లో తడవనోడు తప్పు చేయనోడు లేనట్టు
వాయిదా పద్దుంటే వరిగడ్లో పొనుకున్నా లేసొస్తాడు
వాసాలమీద కప్పడమేసినట్టు
వినుటకు వేగిరడి మాట్లాడేదానికి నిదానిచ్చు
శిలాపాపం తలాపిడికిడు
శివునాజ్ఞలేనిదే సీమైనా కుట్టదు
సంకురాత్రొస్తే కోడి నిన్నో నన్నో అంటుందంట
సందుజూసి గుద్దిలేస్తారు
సందుదొరికినబ్బుడే సంకెక్కా
సంసారం గుట్టు రోగం రట్టు
సక్కనమ్మ సిక్కినా అందమే
సమాంతర రేఖలు కలవంట
సవీసారం లేంది సట్టిడన్నట్టు
సవీసారంలేంది సట్టిడన్నట్టు
సాతిలో ఆన ఆనిముత్యం
సాపాటులేంది ఏపాటూ లేదు
సామెత-సాకిలోని కన్న మ్యాకులోడు మేలు
సారకతినేదాన్ని సైగజేసినట్లు
సాలె పిల్ల వాటేసిన కోడి పిల్ల కూతేసిన కింద నిలవరు
సావుసుద్ది సల్లగా
సింతలేనమ్మకి సంతలో నిద్ర
సీతబుట్టె లంక జెడె
సూపులకి మేపులకి ఉన్నాడమ్మ కోజి నా సామి ,ఇంగేంపసలేదు
సెదిరి సెన్నూరుదావలు బట్టినట్టు
సెరువుమింద అలిగితే నీగుద్దే పాస్తుంది
సేవకునిలా పనిచేయాలి రాజులా బతకాలి
సేసినమ్మకు సేసినంత
సొంతింటికి బాడిగేల
సొమ్మొకన్ది సోకొకన్ది